అల్లు అరవింద్ సమర్పణలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘గని’. జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర నటీనటులుగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు బాబీ కంపెనీ, రెన్సాన్స్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమా ఈనెల 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “జీవితంలో గెలువాలనుకునే వారికి గని సినిమా ఓ స్ఫూర్తిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను రూపొందించాం. ఓ క్రీడాకారుడు తన జీవితంలోని సమస్యలను ఎదురించి విజయాన్ని ఎలా చేజిక్కించుకున్నాడనేది మూల కథ. ఇందులో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. గని సినిమా కోసం చాలా మంది బాక్సర్ల జీవితాలను అధ్యయనం చేశాను. బాక్సర్లు ఎదుర్కొన్న సమస్యలను తెలుసుకొని అందరికీ ప్రేరణగా ఉండేలా ఈ సినిమాను తెరకెక్కించాను. కమర్షియల్ అంశాలను కూడా ఈ సినిమాలో జోడించాము. ఈ సినిమాలో వరుణ్‌తేజ్ అద్భుతంగా నటించాడు. సినిమా కోసం బాక్సర్ల వద్ద శిక్షణ పొందాడు. సాయి మంజ్రేకర్ రోల్ బాగుంటుంది. వరుణ్‌తో ఫీల్‌గుడ్ లవ్ ట్రాక్ ఉంటుంది. వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌గా కథ కొనసాగుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమిది. గని సినిమాలో ఉపేంద్ర, జగపతిబాబు, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర పాత్రలు బలంగా ఉంటాయి. కథతో మిళితమై ఈ పాత్రలు ఉంటాయి కాబట్టి నేను ట్రైలర్‌లో ఎక్కువగా చూపించలేదు. ఇక నిర్మాత చెరుకూరి సుధాకర్ బ్యానర్‌లో ఓ సినిమా చేయబోతున్నాను. అలాగే వరుణ్‌తేజ్ నిర్మాతగా ఓ సినిమా చేయాలని కమిట్ అయ్యాను” అని అన్నారు.
Kiran Korrapati Interview about Ghani Movie