న్యూఢిల్లీ : రోజూ పెరుగుతున్న ఇంధన ధరలపై కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ‘ప్రధానమంత్రి జన్‌ధన్ లూట్ యోజన’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అవహేళన చేశారు. 2014లో యూపీఎ పాలన లో బైక్‌లు, కార్లు ట్రాక్టర్, ట్రక్కుల్లో ఫుల్ ట్యాంక్ ఇంధనం నింపేందుకు ఎంత ఖర్చు అయ్యేదీ, ఇప్పుడెంత ఖర్చవుతుందీ, ఎంతమేరకు ధరలు పెరిగాయో పేర్కొంటూ ట్వీట్ చేశారు. మోడీ ప్రభుత్వ హయాంలో ప్రతి ఉదయం ఉత్సాహం కంటే ద్రవ్యోల్బణం బాధ కలిగిస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా వ్యాఖ్యానించారు. రెండు వారాల్లో పెట్రోల్, డీజిల్ రూ. 8.40 వరకు పెరిగిందని, సీఎన్‌జీ కేజీకి రూ.2.50 పెరిగిందంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా, ఇవాళ దేశంలో ఇంధనం లూటీలో కొత్త వాయిదాగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు 40 పైసలు వంతున పెరిగాయి. ఓట్ ఫర్ బిజెపి అంటే ద్రవ్యోల్బణానికి ఆదేశం అని ఆయన వాఖ్యానించారు.
Rahul Gandhi Slams PM Modi over fuel rates hike