- Advertisement -
ముంబై: మహారాష్ట్రకు చెందిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) షాక్ ఇచ్చింది. రూ.1034 కోట్ల పత్రాచౌల్ స్కాంకు సంబంధించిన రౌత్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. దాదార్, అలీబాగ్ లోని ఫ్లాట్లు అటాచ్ చేసిన వాటిలో ఉన్నాయి. అటు బిజెపిపై విమర్శలు చేస్తున్నందుకే సంజయ్ రౌత్ పై కక్ష సాధిస్తున్నారని శివసేన నేతలు విమర్శిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి సంజయ్ రౌత్‌కు సన్నిహితుడిగా పేరున్న వ్యాపారవేత్త ప్రవీణ్ రౌత్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఈడీ అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 1న, ఏజెన్సీ ప్రవీణ్‌పై ఛార్జిషీట్ దాఖలు చేసింది.
- Advertisement -