న్యూఢిల్లీ : ప్రాచీన చరిత్రను మాత్రమే కాకుండా సమకాలీన చరిత్రను కూడా బిజెపి వక్రీకరిస్తోందని, ఈ అజెండాకు అగ్నికి ఆజ్యం తోడయ్యేలా చేయడానికి కొన్ని అంశాలను దురుద్దేశంతో లేవనెత్తుతోందని , ఈ విద్వేష ప్రతికూల శక్తులను మనమంతా ఎదిరించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఒక రాష్ట్రం తరువాత మరో రాష్ట్రంలో అధికార పార్టీకి, ఆ పార్టీ నేతలకు రాజకీయ చర్చలో విభజన, కేంద్రీకరణ అజెండా ఓ భాగంగా మారిపోయిందన్నారు. అనేక శతాబ్దాల నుంచి భారత దేశ వైవిధ్యభరితమైన సమాజంలో స్థిరపడిన శాంతి, సామరస్యాలకు నష్టం కలిగించడానికి తాము అవకాశం ఇవ్వబోమని తెలిపారు. ప్రభుత్వ కంపెనీలను విక్రయించే పథకాన్ని కూడా ఆమె తప్పుబట్టారు. 2016 లో పెద్ద నోట్ల రద్దు మాదిరిగానే ఈ పథకం వల్ల కూడా విపత్తు సంభవిస్తుందని హెచ్చరించారు. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)పై వడ్డీ రేటును ప్రభుత్వం తగ్గించిందని, అసెట్ మోనెటైజేషన్ అనే ఆకర్షణీయమైన పేరు పెట్టి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని మండిపడ్డారు.
చరిత్రను బిజెపి వక్రీకరిస్తోంది : సోనియా
- Advertisement -
- Advertisement -
- Advertisement -