Monday, December 23, 2024

నిఫ్టీ 18,000 దిగువకు…435 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్

- Advertisement -
- Advertisement -
NSE
కుదేలయిని బ్యాంకు స్టాకులు, వెలిగిపోయిన పవర్ స్టాకులు

ముంబయి: భారతీయ బెంచ్‌మార్క్ సూచీల రెండు రోజుల దూకుడుకు బ్రేక్ పడింది. ఏప్రిల్ 5 న  నిఫ్టీ 18,000 స్థాయి కంటే దిగువన ముగిసింది. స్టాక్ ముగిసే సమయానికి  సెన్సెక్స్ 435.24 పాయింట్లు లేదా 0.72% క్షీణించి 60,176.50 వద్ద,  నిఫ్టీ 96 పాయింట్లు లేదా 0.53% క్షీణించి 17,957.40 వద్ద స్థిరపడ్డాయి. దాదాపు 2280 షేర్లు పురోగమించగా, 1035 షేర్లు క్షీణించాయి. 97 షేర్లు హెచ్చుతగ్గులు లేకుండా ముగిశాయి.

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు కోటక్ మహీంద్రా బ్యాంక్ నిఫ్టీ ప్రధాన నష్టపోయిన షేర్లు కాగా. అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ప్రధానంగా లాభపడ్డాయి.  సెక్టోరల్ ఫ్రంట్‌లో, ఆటో, ఎఫ్‌ఎంసిజి మరియు పవర్ సూచీలు 1-3 శాతం పెరగగా, బ్యాంక్ ఇండెక్స్ 1 శాతం తగ్గింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 1 శాతం చొప్పున పెరిగాయి.

ఇదిలావుండగా, భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే  సోమవారం నాటి ముగింపు 75.32కు  22 పైసలు పెరిగి,   నేడు 75.54 వద్ద ముగిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News