Monday, December 23, 2024

రేపు, ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా వడగళ్ల వానలు

- Advertisement -
- Advertisement -

Tomorrow there will be hailstorms across telangana

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. రాష్ట్రంలో రేపు, ఎల్లుండి అక్కడక్కడా వడగళ్ల వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతోపాటు అక్కడక్కడ పొడిగాలులు వీస్తాయని వెల్లడించింది. మరఠ్వాడా నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, పొడిగాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ వివరించింది.

మొదటి 15 రోజుల పాటు ఎండలు మండుతాయ్…

ఏప్రిల్‌లోనూ ఎండలు దంచికొడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెలలో మొదటి 15 రోజుల పాటు ఎండలు మండిపోయే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి)హెచ్చరించింది. బుధవారం వరకు పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండి ప్రకటించింది. హిమాలయ పర్వతాల్లోనూ ఈసారి ఉన్నట్టుండి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయని ఐఎండి స్పష్టం చేసింది.

ఇలాంటి వాతావరణం వల్ల అడవుల్లో కార్చిచ్చు అంటుకునే అవకాశాలు ఉన్నాయని ఐఎండి తెలిపింది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవల 41 డిగ్రీలకు మించి ఉష్ణోత్రలు నమోదయ్యాయని వాతావరణ విభాగం స్పష్టం చేసింది. మరోవైపు, మండిపోతున్న ఎండలు దశాబ్దాల రికార్డులను బద్దలు కొడుతుండగా ఏకంగా 122 ఏళ్ల తర్వాత దేశంలో గత నెలలో అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం విశేషం. 1901 తర్వాత ఈ మార్చిలో సరాసరి 33.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, 2010లో నమోదైన 33.09 డిగ్రీల రికార్డు చెరిగిపోయింది. ఈ ఎండల ప్రభావం ఏప్రిల్‌లోనూ ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News