Friday, December 20, 2024

పోలీస్ అభ్యర్థుల శిక్షణకు ఏర్పాట్లు పూర్తి

- Advertisement -
- Advertisement -

Hyd police offers pre-recruitment training for job

ప్రీ-రిక్రూట్‌మెంట్ ప్రవేశపరీక్షకు అనూహ్య స్పందన
హాజరైన 16,000 మంది అభ్యర్థులు
5,000మందికి ఉచిత శిక్షణ ఇస్తాం
పరిశీలించిన హైదరాబాద్ సిపి సివి ఆనంద్

హైదరాబాద్: పోలీస్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. పోలీస్ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు మంగళవారం ప్రి రిక్రూట్‌మెంట్ పరీక్ష నిర్వహించారు. నగరంలోని ఏర్పాటు చేసిన 36 పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో 21,000మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 16,000మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ పరీక్ష నిర్వహణకు విస్కృతమైన ఏర్పాట్లు చేశామని అన్నారు. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఐదు జోన్లలో ప్రతి జోన్‌కు రెండు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కేంద్రాల్లో 5,000మంది అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పోలీస్ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులకు మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణకు కావాల్సిన నిధులను సిఎస్‌ఆర్, హెచ్‌సిపి బడ్జెట్, ప్రభుత్వ నిధుల నుంచి సమకూర్చనున్నట్లు తెలిపారు.

పోలీసు శాఖలో అభ్యర్థులు ఉద్యోగం సాధిస్తే కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల ఉన్న వారు కూడా గౌరవం ఇస్తారని అన్నారు. రానున్న పోలీస్ ఉద్యోగ ప్రకటనలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3,300 పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. పోలీస్ ఉద్యోగంలో చేరాలనుకునే వారు కష్టపడి చదవాలని, శిక్షణను ఉపయోగించుకోవాలని కోరారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సెంట్రల్‌జోన్‌ని చిక్కడపల్లిలోని అరోరా పరీక్ష కేంద్రం, వెస్ట్‌జోన్ పరిధిలోని హబీబ్‌నగర్‌లో అన్వర్ ఉల్‌ఉలూమ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పరిశీలించారు. కార్యక్రమంలో డిసిపిలు రాజేష్ చంద్ర, జోయల్ డేవిస్, అడిషనల్ డిసిపిలు, ఇన్స్‌స్పెక్టర్ మధుకర్‌స్వామి, భాగ్యకిరణ్, ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News