Monday, December 23, 2024

వరుణ్ మంచి కోస్టార్..

- Advertisement -
- Advertisement -

దర్శకుడు, నటుడు, నిర్మాత, రైటర్ మహేష్ మంజ్రేకర్ కూతురు సయీ మంజ్రేకర్ ‘దబాంగ్ 3’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్యూటీ ‘గని’ సినిమాతో తెలుగులోకి రంగ ప్రవేశం చేసింది. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు బాబీ, సిద్దు ముద్ద సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఈనెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సయీ మంజ్రేకర్ మీడియాతో మాట్లాడుతూ.. “గని సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. వరుణ్ ఓ మంచి కోస్టార్. గని సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. ‘దబాంగ్ 3’ ప్రమోషన్ కోసం హైదరాబాద్‌కి వచ్చినప్పుడు రామ్‌చరణ్‌ని కలవడం గొప్ప ఫీలింగ్‌నిచ్చింది. ఆ సమయంలో నేను తెలుగు సినిమాలు చేస్తానని అస్సలు ఊహించ లేదు. తెలుగు, హిందీలోనే కాదు సౌత్‌లో అన్ని భాషల్లోనూ నటించాలని ఉంది. గ్లామర్ షోకు నేను సిద్ధమే. అయితే పాత్ర డిమాండ్ మేరకు, కథ డిమాండ్ మేరకు మాత్రమే గ్లామర్ షో చేస్తా. ఇక ప్రస్తుతం ‘మేజర్’ సినిమాలో నటిస్తున్నాను”అని అన్నారు.

Saiee Manjrekar about Ghani Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News