- Advertisement -
మహబూబాద్: ప్రైవేటు పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన మహబూబాద్ జిల్లాలోని తొర్రూర్ మండలం వెలికట్టలో బుధవారం చోటుచేసుకుంది. వెలికట్టలోని పిఎస్ఆర్ స్కూల్ లో ఈ ఘటన జరిగింది. పాఠశాల భవనంపై నుంచి దూకిన విద్యార్ధిని ఆరో తరగతి చదువుతున్నట్టు గుర్తించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో యజమాన్యం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక ఎందుకు ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.
- Advertisement -