Monday, December 23, 2024

భారత్ శాంతి పక్షమే

- Advertisement -
- Advertisement -

India aspires for peace:Indian Foreign Minister Jaishankar

ఉక్రెయిన్‌పై జైశంకర్

న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. ఇండియా ఏదో పక్షాన్ని ఎంచుకుందనుకుంటే అది కేవలం ప్రపంచశాంతి పక్షమే అని తేల్చిచెప్పారు. భారతదేశం శాంతిని ఆకాంక్షిస్తుందని, ఇక్కడ కూడా ఈ శాంతి వైపు నిలిచిందని అన్నారు. హింసా భయానక కాండలు వెంటనే నిలిచిపోవాలని సూచించారు. బుధవారం లోక్‌సభలో ఉక్రెయిన్ పరిస్థితిపై జరిగిన చర్చలో మంత్రి పాల్గొన్నారు. అక్కడ యుద్ధం ఆరంభం కాగానే భారతదేశమే ముందుగా పౌరుల తరలింపును చేపట్టిందని, విజయవంతం అయిందని, ఈ దిశలో ప్రపంచానికి ఆదర్శం స్ఫూర్తిని ఇచ్చిందని తెలిపారు. వెంటనే రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలు జరగాలని భారతదేశం కోరుతోందని తెలిపారు. బుచాలో ఘటనల గురించి ప్రస్తావిస్తూ అక్కడ దారుణాలు జరిగాయనే వార్తలు భారతదేశాన్ని కలవరపర్చాయని సభకు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News