Monday, December 23, 2024

క్రైమ్ అండ్ సస్పెన్స్‌తో…

- Advertisement -
- Advertisement -

Crime and suspension Movie

 

ఆదర్శ్, చిత్ర శుక్లా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న నూతన చిత్రం బుధవారం నాడు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. చేతన్ రాజ్ ఫిలింస్ పతాకంపై చేతన్ మైసూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజమౌళి సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన ఆంథోనీ.ఎం దర్శకుడి పరిచయమవుతున్నాడు. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రమేష్ ప్రసాద్ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఆంథోనీ ఎం. మాట్లాడుతూ “ క్రైమ్ అండ్ సస్పెన్స్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం”అని అన్నారు. రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, భరణి, జయశ్రీ ప్రధాన పాత్రల్లో నటించే ఈ చిత్రానికి కెమెరా: వెంకట హనుమ నారిశెట్టి, సంగీతం: గోపీ సుందర్, ఫైట్స్: పృథ్వీ, ఎడిటర్‌ః కిశోర్ కుమార్.ఎం, డైలాగ్స్: దత్తు, శశి, పాటలు: రెహమాన్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News