- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా గురువారం 1,033 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,30,31,958కి పెరిగింది. కాగా..కరోనా వైరస్ నుంచి తాజాగా 232 మంది కోలుకోవడంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,639కి క్షీణించింది. గడచిన 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా మరో 43మంది మరణించడంతో ఇప్పటివరకు కరోనా వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 5,21,530కి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా సంభవించిన 43 కరోనా మరణాలలో 32 కేరళ కు చెందినవే. ఇప్పటివరకు దేశంలో మొత్తం 182.20 కోట్ల డోసుల కరోనా వ్యాక్సినేషన్ జరిగినట్లు కేంద్రం పేర్కొంది.
- Advertisement -