మన తెలంగాణ,సిటీబ్యూరో: ఉస్మానియా యూనివర్శిటీలో పండ్ల చెట్లు, ఉపయోగపడే చెట్లను విరివిరిగా పెంచాలని జిల్లా కలెక్టర్ శర్మన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ చాంబర్లో జరిగిన జిల్లా గ్రీన్ ఛాంపియన్ సర్టిఫికెట్ ప్రధానోత్సవం సందర్భంగా ఆయనమాట్లాడుతూ పండ్ల మొక్కలను పెంచినట్లయితే పక్షులు, జంతువులు జీవించడానికి ఉపయోగపడుతాయని, వాటిపై దృష్టి పెట్టాలని కోరారు.
2021-22 అకాడమిక్ సంవత్సరంకు శానిటేజన్, హైజీన్, వేస్ట్‌మేనేజ్‌మెంట్, వాటర్ మేనేజ్‌మెంట్, ఎనర్జీ మేనేజ్‌మెంట్, గ్రీనరీ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన విషయాల్లో మంచి ప్రతిభ కనబరచినందుకు ఉస్మానియా యూనివర్శిటీకి డిస్ట్రిక్ గ్రీన్ ఛాంపియన్ సర్టిఫికెట్‌ను భారత ప్రభుత్వ సంస్ద అయిన మహాత్మాగాందీ నేషనల్ కౌన్సిల్ ఆప్ రూరల్ ఎడ్యుకేషన్ సంస్ద ఎంపిక చేసింది. ఈకార్యక్రమంలో డా. శ్రీనివాసులు, డైరెక్టర్ సెంటర్ ఫర్ బయోడైవర్సిటీ, కన్జర్వేటివ్ స్టేషన్, సుధీర్‌కుమార్, యం.జియున్‌సిఆర్‌ఐ పాల్గొన్నారు.