అమరావతి: ఈ నెల 11వతేదీన జరగనున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సిఎం క్యాంపు కార్యాలయం నుండి నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై వీడియో సమావేశం ద్వారా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ నూతన మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయడంతో పాటు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల కార్యదర్శులను, పోలీస్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. బ్లూబుక్ లోని నిబంధనల ప్రకారం నూతన మంత్రి వర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు సంబంధిత శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో డిఐజిలు సి.త్రివిక్రమ వర్మ, రాజశేఖర్, సమాచార శాఖ సంయుక్త సంచాలకులు పి.కిరణ్ కుమార్ తదితరులుతో పాటు వీడియో సమావేశం ద్వారా గుంటూరు కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి, ప్రోటోకాల్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి, ఇంకా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆప్ర. కొత్త మంత్రుల ప్రమాణస్వీకార ఏర్పాట్లపై సమీక్ష
- Advertisement -
- Advertisement -
- Advertisement -