సమర్థించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం 2010లోని నిబంధనలకు చేసిన నిర్థిష్ట సవరణలు సబబే అని సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఈ సవరణలు 2020 సెప్టెంబర్ నుంచి అమలులోకి వచ్చాయి. సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఊరట కల్గించింది. ఫారెన్ కాంట్రిబ్యూషన్‌పై కటుతరమైన నియంత్రణ ఉండాల్సిందే. ఇంతకు ముందటి అనుభవాలు ఈ విరాళాల దుర్వినియోగం, అవకతకలను తెలియచేస్తున్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. తమకు అందే విదేశీ నిధుల వాడకంపై కఠినమైన మితిమీరిన ఆంక్షలు విధించేలా కేంద్రం చట్టానికి సవరణలు తెచ్చిందని పేర్కొంటూ , ఈ చర్యను సవాలు చేస్తూ స్వచ్ఛంద సేవా సంస్థల తరఫున పిటిషన్ దాఖలు అయింది. ల విదేశీ విరాళాల స్వీకరణ సంస్థల హక్కు కాదని, దీనిపై సంస్థలకు పూర్తి స్థాయి అధికారాలు ఏమీ లేవని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇక విదేశాల నుంచి అందే సాయం జాతీయ విధానాలకు చేటు కల్గించే అవకాశాలు ఉన్నాయనే విషయం ప్రపంచవ్యాప్తంగా రూఢీ అయిందని, దీనితో తాముఏకీభవిస్తున్నామని న్యాయమూర్తులు ఎఎం ఖాన్విల్కర్, దినేష్ మహేశ్వరి, సిటి రవికుమార్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది.