Saturday, November 23, 2024

పబ్ డ్రగ్స్ కేసులో 20మందికి నోటీసులు

- Advertisement -
- Advertisement -

Notices to 20 in Pub Drugs case

నోటీసులు అందుకున్న వారిలో విఐపిలు

మనతెలంగాణ/హైదరాబాద్: పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో పార్టీలో పాల్గొన్న వారిలో 20 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలు లభించడంతో వారికి పోలీ సులు నోటీసులిచ్చారు. పోలీసుల నుం చి నోటీసులు అందుకున్న వారిలో కొం తమంది విఐపిలు కూడా ఉన్నట్లు తెలు స్తోంది. పుడింగ్ పబ్ కేసులో మేనేజర్ అనిల్‌తో పాటు అభిషేక్ కనుసన్నల్లోనే డ్రగ్స్ సరఫరా అయినట్లు పోలీసుల వి చారణలో తేలింది. అభిషేక్ కాంటాక్ట్ లి స్ట్‌లో గోవా, ముంబైకి చెందిన కొంత మంది పేర్లుఉండటంతో వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మేనేజర్ అనిల్ కాంటాక్ట్ లిస్ట్‌లో గతంలో డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన సరఫరాదారులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గోవా, ముంబై నుంచి అనిల్ డ్రగ్స్ తెప్పించినట్లు పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున పుడింగ్ మింక్ పబ్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించిన సమయంలో పబ్ లో 145 మంది ఉండగా వారిలో పబ్ లో 20 మంది డ్రగ్స్ వినియోగించారని పోలీసులు ఆధారాలను సేకరించారు.

పబ్‌లో దాడులు జరుగక మునుపు మూడు టేబుల్స్‌ను రిజర్వ్ చేశారని, ఆదివారం తెల్లవారుజామున 15 నుండి 20 మంది వచ్చే వరకు ఆ మూడు టేబుల్స్ ను పబ్ యాజమాన్యం ఎవరికీ కూడా కేటాయించలేదని పోలీసులు గుర్తించారు. ఈక్రమంలో ఆదివారం తెల్లవారుజాము సమయంలో ఈ మూడు టేబుల్స్ ను 20 మంది వినియోగించారని, వారికి ఇద్దరు మాత్రమే సర్వ్ చేశారని కూడా పోలీసులు గుర్తించారు. ఈ మూడు టేబుల్స్ ను వినియోగించింది ఎవరు, వారికి ఏ రకమైన పదార్ధాలు సర్వ్ చేశారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.హైదరాబాద్ బంజారాహిల్స్ పుడింగ్ మింక్ పబ్ కేసులో దర్యాప్తును లోతుగా చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈకేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన పబ్ మేనేజర్ అనిల్ కుమార్, పబ్ నిర్వాహకుడు అభిషేక్ ఉప్పలను పోలీసులు విచారించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఈ ఇద్దరిని కనీసం 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కూడా పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News