- Advertisement -
కొలంబో: తమిళులు, సింహళుల నూతన సంవత్సరం(ఉగాది) అతి దగ్గరలో…ఏప్రిల్ 14న జరుగనుంది. కానీ శ్రీలంకలో ఏ ఇంట్లో చూసినా కష్టాలే. పచారి కొట్లలో సరకులు కరువు. అన్ని స్టోర్‌లు ఖాళీగా ఉన్నాయి. ఇక ఇంధనం పంప్ స్టేషన్‌ల వద్దనైతే పెద్దపెద్ద లైన్లు. ఇక అందరి ఇండ్లలో ఏమీ పాలుపోని స్థితి. వీధుల్లో చూస్తే జన ఆగ్రహోదగ్రాలు. ఎల్‌టిటిఇని ఓడిస్తున్న కాలంలో అక్కడి బౌద్ధులకు జనం మొక్కులు చెల్లించారు. కానీ నేడు పరిస్థితి మారిపోయింది. జనం నేడు ‘గో, గోటా , గో’ అంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రధాని మహింద రాజపక్స, ఆయన అన్న అధ్యక్షడు గోటబయ ఇంటి ముందు పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. సరకుల కొరత, ధరల పెరుగుదల శ్రీలంకలో సామాన్యులను మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నది. ఇదిలావుండగా శ్రీలంక వాసులు భారత సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
- Advertisement -