Friday, November 22, 2024

భారత్‌లో తగ్గిపోయిన విదేశీమారకం నిల్వలు!

- Advertisement -
- Advertisement -

Foreign Exchange
ముంబయి: భారత విదేశీ మారక వారంతపు నిల్వలు ఏప్రిల్ 1నాటికి 11.17 బిలియన్ డాలర్లు తగ్గిపోయింది. చివరికి 606.475 బిలియన్ డాలర్ల వద్ద ఇది స్థిరపడిందని భారత రిజర్వు బ్యాంకు డేటా పేర్కొన్నట్లు పిటిఐ వార్తా సంస్థ తెలిపింది. భారత విదేశీ మారకపు నిల్వలు పడిపోవడానికి ఉక్రెయిన్ యుద్ధం, కొనసాగుతున్న కొవిడ్19 మహమ్మారి, ఇతర అంతర్జాతీయ పరిణామాలు కారణమని తెలుస్తోంది. భారత్ వద్ద బంగారం నిల్వలు కూడా 507 మిలియన్ డాలర్ల మేరకు తగ్గి 42.734 బిలయన్ డాలర్ల వద్ద స్థిరపడిందని ఆర్‌బిఐ డేటా పేర్కొంది. గమనించాల్సిన విషయమేమిటంటే గత నాలుగు వారాల్లో భారత విదేశీ మారక నిల్వలు దాదాపు 26 బిలియన్ డాలర్ల మేరకు పడిపోయింది. భారత రిజర్వు బ్యాంకు శుక్రవారం 2022/23 ఆర్థిక సంవత్సరపు తొలి ద్రవ్య విధానం ప్రకటించింది. రెపో రేటును 4శాతం, రివర్స్ రిపో రేటును 3.5 శాతం వద్ద స్థిరంగా ఉంచింది. భారత జిడిపి 7.2 శాతం, తొలి త్రైమాసిన ద్రవ్యోల్బణం 6.3 శాతం వద్ద, రెండో త్రైమాసిక ద్రవోయల్బణం 5 శాతం, మూడో త్రైమాసిక ద్రవ్యోల్బణం 5.4 శాతం, నాలుగో త్రైమాసిక ద్రవ్యోల్బణం 5.1 శాతం ఉండగలదని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రొజెక్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News