Friday, December 20, 2024

’ఎఫ్3’లో పూజా హెగ్డే పాటకు అక్షరాల కోటి రూపాయలు!

- Advertisement -
- Advertisement -

Puja Hegde

హైదరాబాద్: వర్ధమాన నటి పూజా హెగ్డే ‘ఎఫ్3’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో నటించేందుకు అక్షరాల రూ.1 కోటి తీసుకున్నట్లు సమాచారం. ఆమె ఇదివరలో ‘రంగస్థలం’ సినిమాలో ‘జిగేల్ రాణి’ పాటతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అది కూడా ఓ ఐటెమ్ సాంగే! ఆమె పాటకు కోటి రూపాయలు డిమాండ్ చేసినా ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరించారట. ఇప్పుడు తీయబోయే పాట కూడా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకంతో నిర్మాతలున్నారు. పూజా హెగ్డే ప్రస్తుతం తమిళ చిత్రం ‘బీస్ట్’లో నటించింది. ఆ చిత్రం ఏప్రిల్ 13న విడుదల కాబోతోంది. కాగా ‘ఎఫ్3’ చిత్రం ఐటెమ్ సాంగ్ కూడా మరో హైలైట్ కాబోతోందేమో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News