Monday, December 23, 2024

అక్బరుద్దీన్ కు నాంపల్లి కోర్టు ఊరట

- Advertisement -
- Advertisement -

Nampally Court to Final Verdict on Akbaruddin Owaisi

వివాదాస్పద వ్యాఖ్యల కేసు కొట్టివేత

హైదరాబాద్‌: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ వివాదాస్పద వాఖ్యల కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పును వెల్లడించింది. అక్బరుద్దీన్‌పై నమోదు అయిన రెండు కేసులను కోర్టు కొట్టివేస్తూ బుధవారం తీర్పు ఇచ్చింది. తొమ్మిదేళ్ల కిత్రం నిజామాబాద్‌, నిర్మల్‌లో మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్య లు చేశారంటూ అక్బరుద్దీన్‌ ఒవైసీపై నమోదైంది. ఈ కేసులో 30 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. ఈ కేసులో గతంలో అరెస్టైన అక్బరుద్దీన్‌ 40 రోజుల పాటు జైల్లో ఉన్నారు. బుధవారం ఈ మేరకు తీర్పు వెల్లడించిన నాంపల్లి కోర్టు.. కేసులను కొట్టేస్తూ అక్బరుద్దీన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. అంతేకాదు భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని, అలాంటి వ్యాఖ్యలు దేశ సమగ్రతకు మంచిదికాదని కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే కేసు కొట్టివేసినంత మాత్రానా సంబురాలు చేసుకోవద్దని కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో.. పాతబస్తీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News