Monday, December 23, 2024

సోనమ్ కపూర్ ఇంట్లో చోరీ కేసులో నర్సు, ఆమె భర్త అరెస్టు

- Advertisement -
- Advertisement -

Police arrests nurse, husband for stealing in Sonam Kapoor house

 

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ నివాసం నుంచి రూ. 2.4 కోట్ల విలువైన నగదు, బంగారు ఆభరణాలను చోరీ చేశారన్న ఆరోపణపై ఆమె ఇంట్లో పనిచేస్తున్న నర్సును, ఆమె భర్తను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని సంపన్నులు నివసించే అమృతా షేర్గిల్ మార్గ్‌లో ఉన్న సోనమ్ కపూర్ నివాసంలో ఫిబ్రవరిలో చోరీ జరిగింది. సోనమ్ అత్తగారి ఆరోగ్య సంరక్షణ కోసం అపర్ణ రూత్ విల్సన్ నర్సుగా పనిచేస్తోంది. ఆమె భర్త నరేష్ కుమార్ సాగర్ షకర్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు. వీరు సరితా విహార్‌లో నివసిస్తున్నారని, అపర్ణ నర్సుగా, హోమ్ మెడికల్ కేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తోందని వారు చెప్పారు. ఫిబ్రవరి 11న సోనమ్ ఇంట్లో చోరీ జరిగిందని, ఫిబ్రవరి 23న తుగ్లక్ రోడ్ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైందని వారు చెప్పారు. సోనమ్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోనమ్ భర్త ఆనంద్ ఆహుజా నివాసంలో 20 మందికి పైగా పనిచేస్తారని ఆయన పోలీసులకు తెలిపారు. చోరీకి గురైన నగలు, నగదు ఇంకా స్వాధీనం చేసుకోవలసి ఉందని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News