Monday, December 23, 2024

ఆగకుండా చినూక్ దూకుడు

- Advertisement -
- Advertisement -

Indian Air Force sets record with 1910 km helicopter sortie

1910 కిమీలు.. ఏడున్నర గంటలు

న్యూఢిల్లీ : ఎక్కడ ఆగకుండా ఏకంగా 1910 కిలోమీటర్లు పయనించి భారతీయ వాయుదళ చినూక్ హెలికాప్టర్ మైలురాయి రికార్డును సాధించింది. ఓ హెలికాప్టర్ ఆగకుండా ఇంతదూరం పయనించడం ఇదే తొలిసారి. చండీగఢ్ నుంచి అసోంలోని జోర్హట్‌కు ఏడున్నర గంటల వ్యవధిలో ఈ అలుపెరుగని గగనసారి యాత్ర సాగింది. ఈ విషయాన్ని వాయుసేన అధికారులు బుధవారం తెలిపారు. యుద్ధ సమయంలో గగనతలంలో ఎక్కువ సేపు ఉండటం అత్యవసరం అవుతుంది. అదే విధంగా విపత్కర పరిస్థితులలో కేవలం దూర ప్రాంతాలకు వెళ్లడమే కాకుండా వ్యూహాత్మక కార్యాచరణ, సాయానికి ప్రాతిపదికను అందించడం ఈ చినూక్ సొంతం అయింది. అమెరికా నుంచి 15వరకూ ఈ చినూక్ తరహా హెలికాప్టర్లు సమీకరించుకునేందుకు 2015 సెప్టెంబర్‌లో భారతదేశం కాంట్రాక్టు కుదుర్చుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News