- Advertisement -
న్యూఢిల్లీ : తమిళనటుడు విజయ్ కొత్త సినిమా బీస్ట్ ప్రపంచవ్యాప్తంగా చిక్కుల్లో పడింది. ఈ సినిమాను ముందుగా ఇప్పుడు కువైట్, ఖతార్‌లలో నిషేధించారు. ఈ సినిమాలో ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించినట్లు, ఇస్లామ్ పట్ల ద్వేష భావాలు రేకెత్తించేవిలా సన్నివేశాలు ఉన్నట్లు టిఎన్ ముస్లిం అసోసియేషన్ గుర్తించింది. ఈ సంఘం ఇప్పటికే ఈ సినిమాను నిరసించింది. ఈ చిత్రం ట్రయలర్‌లు థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ఇందులో పాకిస్థాన్ వ్యతిరేక డైలాగులు ఉన్నాయి. ఈ సినిమాలో విజయ్ రా ఏజెంటుగా నటించారు. ఉగ్రవాదులతో తలపడుతాడు. ఈ సినిమా బుధవారం విడుదల అయింది.
- Advertisement -