Sunday, November 17, 2024

ధాన్యం కొనుగోలు ‘రేపటి నుంచే’

- Advertisement -
- Advertisement -

Government arrangements for purchase of yasangi grain

పటిష్టంగా ఏర్పాట్లు క్వింటాలుకు కనీస మద్దతుధర రూ.1960
పక్క రాష్ట్రాల నుంచి వచ్చే గింజ కూడ కొనం రాష్ట్ర సరిహద్దుల్లో 51చెక్‌పోష్టులు
మే చివరికి లేదా జూన్ మొదటి వారానికి ధాన్య సేకరణ పూర్తి బాధ్యతల నుంచి తప్పించుకున్న కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోలేదు ముఖ్యమంత్రి కెసిఆర్ అసమాన మానవతామూర్తి ఆయన ఆదుకోకపోతే రైతాంగం ఏమయ్యేవారో ! యాసంగిలో సాగు చేసిన పంటల సమగ్ర వివరాలు ఆన్‌లైన్‌లో భద్రత పరిచాం రైతులు ధాన్యం అమ్ముకోవడానికి వెళ్లినప్పుడు డ్యాష్‌బోర్డులో ఆ వివరాలు కనిపిస్తాయి రైతు మొబైల్‌కి ఒటిపి వస్తోంది ధాన్యం కొనుగోలుకు 15 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం రాష్ట్రం వద్ద కోటి 60లక్షల బ్యాగులున్నాయి మిగతా వాటి కోసం భారత జౌళి కమిషనర్ కు లేఖ రాస్తున్నాం గోదాములు ఎఫ్‌సిఐ చేతిలో ఉన్నాయి కొనుగోలు చేసిన నిల్వ చేయడానికి ఎక్కడ స్థలం ఉంటే అక్కడ తీసుకోమని అధికారులకు సూచించాం : మీడియాతో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

మనతెలంగాణ/హైదరాబాద్ : రైతాంగం ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని యాసంగి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమాలకర్ వెల్లడించారు. క్యాబినెట్ నిర్ణయం ప్రకారం పౌరసరఫరాల శాఖ ధాన్యం కొనడానికి సిద్ధం అయ్యిందని వెల్లడించారు. బుధవారం నాడు మంత్రి గంగుల మీడియా సమావేశం నిర్వహించి ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వ ఏర్పాట్లను వివరించారు. రాష్ట్రంలో ఉన్న సివిల్ సప్లై అధికారులు, అదనపు కలెక్టర్లు, పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించామని తెలిపారు.శుక్రవారం నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు.మే చివరినాటి లేదా జూన్ మొదటి వారం నాటికి ధాన్యం సేకరణ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించామన్నారు. ధాన్యంపై కేంద్రం బాధ్యత నుంచి తప్పించుకుందన్నారు..కేంద్రం రైతాంగాన్ని అదుకోలేదన్నారు. మానవతా దృక్ఫదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకోకపోతే రైతులు ఏమి అయిపోయే వారో అని అందరూ ఆందోళన చెందారన్నారు. తెలంగాణ లో రైతులు పండించిన ధాన్యం కొంటామని , ఇతర ప్రాంతాల ధాన్యం తెస్తే గింజ కూడా కొనరాదని అధికారులను హెచ్చరించామన్నారు.

వ్యవసాయశాఖ నుంచి ఏఇఓలు యాసంగిలో రైతులు సాగు చేసిన పంటలపై సమగ్రవివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారన్నారు. రైతు ధాన్యం అమ్ముకోవడానికి వెళ్లిన సమయంలో డ్యాష్ బోర్డ్ లో ఆ వివరాలు కనిపిస్తాయన్నారు. రైతు మొబైల్ కి ఓటిపి వస్తుందన్నారు.ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తెలంగాణ కి రాకుండా ఏపి, కర్ణాటక , మహారాష్ట్ర, చత్తిస్‌గడ్ ప్రాంతాల నుంచి వచ్చే సరిహద్దుల్లో 51 చెక్ పోస్ట్ లు పెడుతున్నామని వెల్లడించారు. ఒక్కొక్క కొనుగోలు కేంద్రానికి ఒక నోడల్ ఆఫీసర్ ఉంటారని తెలిపారు. రాష్ట్రంలో 34 లక్షల ఎకరాల లో వరి సాగు జరిగిందని,65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు 15 కోట్ల గన్ని బ్యాగులు అవసరం పడుతుందన్నారు. ఇప్పటికే సంస్థ వద్ద కోటి 60 లక్షల గన్ని బ్యాగులు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. 7 కోట్ల 50 లక్షల కొత్త గన్ని బ్యాగులు కావాలని , వాటికోసం జూట్ కమీషనర్ ఆఫ్ ఇండియాకు లేఖ రాస్తున్నామన్నారు. గన్ని సంచులకోసం రూ. 527 కోట్లు అడ్వాన్స్ కట్టాల్సిన అవసరం ఉందన్నారు.

ఒక్కో గన్నిబాగ్ రూ.70 అవుతుందన్నారు. ఎవరి వద్ద గన్నిబ్యాగ్‌లు ఉన్నా వాటిని వెంటనే సేకరించాలని అధికారులకు సూచించామని తెలిపారు. కొనుగోలు కేంద్రం దాటి బ్యాగ్ లు బయటకి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించినట్లు తెలిపారు. ధాన్యం రవాణాకు అవసరమైన యంత్రాంగాన్ని కూడా సిద్ధంగా ఉంచుతున్నామన్నారు. ఎఫ్ సి ఐ చేతిలో గోదాములు ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలుచేసిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు ఎక్కడా స్థలం ఉంటే అక్కడ తీసుకోమని అధికారులకు సూచించామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కనీస మద్దతు ధర రూ.1960 కంటే ఒక్క రూపాయి తక్కువకు కూడా ఎవరు అమ్ముకోవద్దని రైతులకు సూచించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాని మోడి మెడలు వంచాలి:

బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధాని నరేంద్ర మోడి మెడలు వంచి రైతులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.
రైతు బంధు,రైతు బీమా ,24 గంటల విద్యుత్ ఇవ్వమని మోడీ ని మెడలు ఎందుకు వంచలేదో చెప్పాలన్నారు. మోడీ రాష్ట్రంలో కరెంట్ కట్ లు ఉన్నాయన్నారు. కేంద్రం మెడలు వంచి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలన్నారు. రైతులను రెచ్చగొట్టి యాసంగిలో వరి సాగు చేయించిన బీజేపీ నాయకులు ఇప్పడు తప్పించుకొని తిరుగుతున్నారన్నారు. 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైస్ మిల్లర్లలో ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారని, ఆ బియ్యం తీసుకోమని ఇప్పటికి ప్రభుత్వం 16 లేఖలు రాసిందన్నారు. బియ్యం తీసుకెళ్లి డబ్బులు ఇవ్వమని కేంద్రానికి లేఖ రాశామన్నారు. ఈ లేఖ పై కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.కేంద్రం తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెడుతుందన్నారు.దేశంలో వరి వేసే ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం లేదని , అందుకే వరి వేసే వారిపై కేంద్రం కోపం పెంచుకుందని మంత్రి గంగుల కమాలాకర్ పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News