Monday, December 23, 2024

కారు ఢీకొని జిహెచ్‌ఎంసి కార్మికుడి మృతి

- Advertisement -
- Advertisement -

GHMC worker killed in car crash in banjara hills

హైదరాబాద్: కారు అదుపు తప్పి ఢీకొట్టడంతో జిహెచ్‌ఎంసి కార్మికుడు మృతిచెందిన సంఘటన నగరంలోని బంజారాహిల్స్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… జిహెచ్‌ఎంసిలో కార్మికుడిగా పనిచేస్తున్న కిరణ్ (25) విధి నిర్వహణలో భాగంగా పార్క్ హయత్ హోటల్ వద్ద మొక్కలకు నీరు పెడుతున్నాడు. ఈ క్రమంలోనే అటువైపుగా వస్తున్న కారు అదుపు తప్పి కిరణ్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కిరణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News