Monday, November 25, 2024

సిజెఐ చొరవ అమోఘం

- Advertisement -
- Advertisement -

Number of High Court judges increased with NV Ramana initiative:CMKCR

హైకోర్టులో జడ్జీల సంఖ్య పెరిగింది

42మంది న్యాయమూర్తులకు 30 నుంచి 40 ఎకరాల
స్థలంలో ఒకేచోట క్వార్టర్స్ నిర్మిస్తాం: సిఎం కెసిఆర్

మన తెలంగాణ / హైదరాబాద్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి ర మణ చొరవతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెరిగిందని సిఎం కెసిఆర్ పేర్కొన్నా రు. మేరకు సిజెఐ ఎన్‌వి రమణకు సిఎం కెసిఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ లో శుక్రవారం న్యాయాధికారుల సదస్సు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కింది కోర్టుల్లోని జిల్లా న్యాయమూర్తులతో నిర్వహించిన ఈ సమావేశంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ, హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశ ర్మ, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ రామసుబ్రహ్మణ్యం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలు పాల్గొన్నారు. దాదాపు 400 మంది వివిధ వి భాగాలకు చెందిన న్యాయాధికారులతో మొ దటిసారి ఈ సదస్సు జరిగింది. శుక్ర శనివారాలు, రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో రాష్ట్ర న్యాయ వ్యవస్థను మరింతగా బలోపేతం చేయడం, కోర్టు భవనాల నిర్మా ణం, న్యాయ వ్యవస్థలో పెరుగుతున్న సాంకేతికతను వినియోగించు కునే దిశగా అప్‌డేట్ కావడం, మౌలిక వసతులను మెరుగు పరచ డం, తగినంతగా న్యాయమూర్తులు, అధికారులు, సిబ్బంది నియామకం, ప్రజలకు సత్వ ర న్యాయం అందించే చర్యలతో పాటు న్యా య వ్యవస్థలో పని చేస్తున్న వారి సంక్షేమానికి తగిన చర్యలు చేపట్టడం అనే అంశాలపై ఇందులో చర్చించనున్నారు.

సందర్భం గా కెసిఆర్ మాట్లాడుతూ సిజేఐ సూచనతో 850 అదనపు పోస్టులు మంజూరు చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. జిల్లా కోర్టులకు 1,730 అదనపు పోస్టులు మంజూరు చేశామన్నారు. హైకోర్టు విడిపోయిన తర్వాత బెంచీల సంఖ్య పెంచాలని కేంద్రానికి లేఖ రాశామని, హైకోర్టు బెంచీల సంఖ్య పెరిగింది కాబట్టి సిబ్బంది ఏర్పాటు చేయాలని సిజేఐ చెప్పారని తెలిపారు. కోర్టుల మీద ఉన్న అపారమైన గౌరవంతో రెవెన్యూ కోర్టులను రద్దు చేశామన్నారు. ఎనిమిదేండ్ల క్రితం రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ అందరి సహకారంతో, సమన్వయంతో చక్కగా పురోగమిస్తూ, ఉన్నతస్థాయి శిఖరాలను చేరుకుంటుందన్నారు. పటిష్టమైన పద్ధతులు ఫిస్కల్ ప్రుడెన్స్ (ఆర్థిక జాగ్రత్త), హార్డ్ డిసిప్లేన్(కఠిన క్రమశిక్షణ) అమలు చేయడం ద్వారా ఈ పురోగతి సాధ్యమయ్యిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వెలువరించిన లెక్కల ప్రకారం 2014-,15 సంవత్సరంలో 1.24 లక్షలున్న రాష్ట్ర తలసరి ఆదాయం 2.78 లక్షలకు చేరుకుందన్నారు.
విద్యుత్‌చ్చక్తి రంగంలో సాధించిన పురోగతితో నాటి బాధలు నేడు లేవన్నారు.

ప్రధానికి లెటర్ రాసినా పట్టించుకోలేదు

వ్యవసాయరంగం, పారిశ్రామిక రంగం, సమాచార సాంకేతిక రంగాల్లో అద్భుతంగా పురోగమిస్తున్నామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చి 33 జిల్లాలు కూడా ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ నిర్మాణం చేసుకున్నా మన్నారు. గతంలో కంటే రాష్ట్ర న్యాయవ్యవస్థ, న్యాయ పరిపాలనా విభాగం ఇంకా చాలా గొప్పగా ముందుకు పోవాలన్నారు. ఈ దేశానికి ఆదర్శవంతమైన న్యాయశాఖగా రాష్ట్ర న్యాయ వ్యవస్థ పేరు గడించాలని తాను ఆకాంక్షిస్తున్నానన్నారు. హైకోర్టు విడిపోయిన తర్వాత హైకోర్టు బెంచ్‌ల సంఖ్య పెంచాలని తాను స్వయానా ప్రధానికి లెటర్ రాసినా దానిని పెండింగ్‌లో పెట్టారని సిఎం తెలిపారు.

హైకోర్టులో 24 నుంచి 42కు మన బెంచ్‌ల సంఖ్య

మన తెలుగువారి ముద్దు బిడ్డ, జస్టిస్ ఎన్‌వి రమణ ఉన్నత పదవిని అధిరోహించిన తర్వాతే వారు చొరవ తీసుకొని ప్రధానమంత్రితో, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మన హైకోర్టులో 24 నుంచి 42కు మన బెంచ్‌ల సంఖ్యను పెంపొందింప చేశారన్నారు.రాష్ట్ర ప్రజల పక్షాన, తన పక్షాన, ప్రభుత్వం పక్షాన రమణకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతున్నానని సిఎం కెసిఆర్ తెలిపారు. రాష్ట్ర న్యాయశాఖకు గతంలో 780పై చిలుకు పోస్టులను మంజూరు చేశామని, ఈ మధ్య హైకోర్టు కోసం బెంచ్‌ల సంఖ్య పెరిగిందన్నారు. ఈ సందర్భంగా మరో 885 అదనపు పోస్టులను హైకోర్టుకు మంజూరు చేశామని, ఈ జీఓ కూడా విడుదల చేసి చీఫ్ జస్టిస్‌కు పంపించినట్టు సిఎం తెలిపారు. హైకోర్టు తర్వాత జిల్లా కోర్టుల్లో పనిభారం బాగా ఉందని తనకు సమాచారం అందిందని, తదనుగుణంగా జడ్జి పోస్టులను, మెజిస్ట్రేట్ పోస్టుల సంఖ్యను పెంచాలని చీఫ్ జస్టిస్‌ను కోరుతున్నానని సిఎం పేర్కొన్నారు.

జిల్లా కోర్టుల్లో కూడా సిబ్బంది నియామకం

‘రాష్ట్రం కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కోర్టులు ప్రారంభించాలని సిజెఐ విజ్ఞప్తి మేరకు దానికి సంబంధించి జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలిచ్చినట్టు సిఎం తెలిపారు. డిస్ట్రిక్ కోర్టుల నిర్మాణం కోసం స్థలాలు ఎంపిక చేసి అన్ని వసతులతో కూడిన భవనాల నిర్మాణం చేపడుతామని ముఖ్యమంత్రి హామినిచ్చారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లా కోర్టుల్లో కూడా సిబ్బంది నియామకం మేరకు 1,730 అదనపు పోస్టులను కూడా మంజూరు చేస్తున్నామని, ఈ విషయాన్ని తాను సంతోషంగా ప్రకటిస్తున్నానని సిఎం తెలిపారు. హైకోర్టుల, డిస్ట్రిక్ట్ కోర్టు, మెజిస్ట్రేట్ కోర్టుల్లో తగిన సిబ్బందిని సమకూర్చుతామన్నారు.

న్యాయశాఖకు మరింతగా సంపూర్ణ సహకారం

రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన న్యాయపరిపాలన విభాగం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం పోస్టుల సంఖ్య 4,348 అని సిఎం తెలిపారు. న్యాయశాఖకు మరింతగా సంపూర్ణ సహకారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉందన్నారు. డిజిటలైజేషన్ ఆఫ్ రెవెన్యూ రికార్ట్‌లో భాగంగా కోటి 52 లక్షల ఎకరాల భూముల రికార్డులను డిజిటలైజేషన్ చేయడం జరిగిందన్నారు.కోర్టులపై ఉన్నటువంటి అపారమైన విశ్వాసంతో, నమ్మకంతో రెవెన్యూ కోర్టులను రద్దు చేసి, లిటిగేషన్లను తెలంగాణ జస్టిస్ డిపార్ట్ మెంట్ కు బదిలీ చేయడ జరిగిందని సిఎం తెలిపారు. 30 నుంచి 40 ఎకరాల స్థలంలో 42 మంది హైకోర్టు న్యాయమూర్తులకు ఒకే చోట క్వార్టర్స్ నిర్మించబోతున్నామని సిఎం కెసిఆర్ ప్రకటించారు. ఈ క్వార్టర్స్‌ను శంకుస్థాపన చేయడానికి రమణ త్వరలో సాదరంగా ఆహ్వానిస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు.

ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ప్రారంభించుకున్నాం

జస్టిస్ రమణతో అల్టర్‌నేట్ డిస్‌ప్యూట్ మెకానిజం కోసం భారతదేశంలోనే ప్రప్రథమంగా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ప్రారంభించుకున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. అంతర్జాతీయ వర్తక, వ్యాపార, వాణిజ్య ‘డిస్పోజల్’ లో స్పీడు పెరిగినట్లయితే మనం ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయంలో న్యాయమూర్తులు చొరవ తీసుకోవాలని సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర హైకోర్టు ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న ఈ ‘జ్యుడీషియల్ ఆఫీసర్స్ కన్వెన్షన్’ లో న్యాయవ్యవస్థకు సంబంధించిన 400 మంది అధికారులు కొలువుదీరిన ఈ కార్యక్రమంలో ఫలవంతమైన చర్చలు జరగాలని తాను కోరుతున్నానని సిఎం కెసిఆర్ తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ న్యాయమూర్తుల సంఘం వెబ్‌సైట్ ను సిఎం కెసిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సిజెఐ ఎన్‌వి రమణ సహా పలువురు న్యాయమూర్తులు సిఎం కెసిఆర్ ను ఘనంగా సత్కరించారు. సదస్సుకు హాజరైన వారందరూ సిఎం కెసిఆర్‌తో కలిసి గ్రూప్ ఫొటో దిగారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News