Monday, December 23, 2024

కెసిఆర్ చేతికి ఎముక లేదు

- Advertisement -
- Advertisement -

CJI NV Ramana praises CM KCR

న్యాయాధికారుల సమావేశంలో
భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ

మన తెలంగాణ / హైదరాబాద్ : చేతికి ఎముక లేదనడానికి సిఎం కెసిఆర్ ఒక ట్రేడ్‌మార్క్ అని, న్యాయ వ్యవస్థకు ఆయనొక మంచి మిత్రుడని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం నా డు ఏర్పాటు చేసిన న్యాయాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్. వి.రమణ మాట్లాడుతూ దేశంలో న్యాయ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి కేంద్రం, ఇతర రాష్ట్ర ప్ర భుత్వాలు ప్రయత్నిస్తుంటే సిఎం కెసిఆర్ మాత్రం 4,320 ఉద్యోగాలను సృష్టించారని కొనియాడా రు. హైదరాబాద్ నగరంలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌కు స్థలం, నిధుల కేటాయించినందు కు సిఎంకు ధన్యవాదాలు తెలిపా రు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ సిఎం కెసిఆర్ వల్లే సా ధ్యమైందని, దాని వల్ల ఎన్నో ప్ర యోజనాలు ఉన్నాయని తెలిపా రు. వివాదాల సత్వర పరిష్కారాని కి ఈ కేంద్రం ఉపయోగపడుతోందని, తమ రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేంద్రం ఏర్పాటు చేయాలని పలువురు ముఖ్యమంత్రులు కోరుతున్నట్లుగా సిజెఐ తెలిపారు. న్యాయవ్యవస్థ బలోపేతానికి సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని ఎన్‌వి రమణ ప్రశంసించారు.

తెలంగాణ హైకోర్టులో రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న జడ్జిల పెంపు అంశాన్ని పరిష్కరించామని, జిల్లా కోర్టుల్లోనూ జడ్జిల సంఖ్య పెంచుతున్నామమని వివరించారు. జిల్లా కోర్టుల్లోనూ జడ్జిల సంఖ్య పెంపుతో పాటు న్యాయశాఖకు కావాల్సిన సదుపాయాలపై భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం కోరిక మేరకు హైకోర్టులో 24 మంది న్యాయమూర్తుల సంఖ్యను 42 వరకు పెంచామన్నారు. రాష్ట్ర న్యాయ శాఖ అధికారులు, సిబ్బంది న్యాయమూర్తులు కరోనా సమయంలో అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు. న్యాయ వ్యవస్థ మానవీయ కోణంలో పనిచేయాలని, అన్ని వర్గాలను సమానంగా గౌరవించాలన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మార్పులకు అప్‌గ్రేడ్ కావాలని, న్యాయమూర్తులు భయంలేకుండా పనిచేయాలన్నారు. న్యాయమూర్తులపై భౌతిక దాడులు జరుగుతున్నాయని, న్యాయాధికారులు ఆరోగ్యం, కుటుంబంపై దృష్టిపెట్టాలని సూచించారు. న్యాయాధికారుల పే కమిషన్‌కు సంబంధించి త్వరలో శుభవార్త ఉంటుందని సిజెఐ ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి సిఎం కెసిఆర్ కృష్టి మరువలేదని, న్యాయవ్యవస్థ తరపున ఆయనకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News