- Advertisement -
మేడ్చల్: మైలారుదేవుపల్లి ప్రాంతం కాటేదాన్ పారిశ్రామికవాడలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతుండడంతో దట్టమైన పొగకమ్ముకుంది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.
- Advertisement -