- Advertisement -
అమరావతి: కన్న కూమారుడు ముందే తల్లిపై గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన పల్నాడు జిల్లా గురుజాల పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సొంతూరు వెళ్లడానికి గురుజాల రైల్వే స్టేషన్ లో తన మూడేళ్ల కుమారుడితో కలిసి సదరు మహిళ రైలు కోసం ఎదురుచూస్తుంది. రాత్రి సమయం కావడంతో కొందరు దుండగులు ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉండడంతో అటుగా వెళ్తున్న వారు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -