Saturday, December 21, 2024

అంధుల పాఠశాలలను సందర్శించిన కలెక్టర్

- Advertisement -
- Advertisement -

Collector who visited schools for the blind

హైదరాబాద్ : నగరంలోని దారుల్‌షి ప్రభుత్వ అంధుల బాలుర ఉన్నత పాఠశాల, మలక్‌పేటలోని బి బ్లాక్ అంధుల పాఠశాలను జిల్లా కలెక్టర్ శర్మన్ సందర్శించారు. శనివారం పాఠశాలను సందర్శించి మౌలికవసతులు, మరుగుదొడ్లు, కాంపౌండ్‌వాల్, నీటి సౌకర్యం వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. కొత్త పాఠశాల భవనం నిర్మాణ పనులను ఏ దశకు చేరుకున్నాయో వివరాలు అడిగి కొత్త భవనం నిర్మాణంలో భాగంగా తరగతి గదులను పరిశీలించారు. భవనం నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. తరగతి గదిలో ఉన్న విద్యార్ధులతో ముచ్చటించారు. ఈకార్యక్రమంలో వికలాంగుల వయోవృద్దుల సంక్షేమ సంచాలకులు శైలజా, అసిస్టెంట్ డైరెక్టర్ రాజేందర్, జిల్లా విద్యాధికారిణి రోహిణి, తహసీల్దార్ జుబేదాబేగం ,పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News