- Advertisement -
హీరోయిన్ ఇలియానా ఆ మధ్య బాగా లావుగా కనిపించింది. అందుకే ఆమెకు అవకాశాలు తగ్గాయన్న మాట వినిపించింది. కానీ తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే ఆ మాట తప్పు అనిపిస్తోంది. ఆమె అందచందాల్లో ఇంకా మెరుపు తగ్గలేదు. ఇక ఈ ఫోటోల్లో సమ్మర్ గౌన్‌లో మెరిసింది ఈ బ్యూటీ. జనాల చూపు తన ఒంపుసొంపులపై పడేలా ఫోజు ఇచ్చింది. 35 ఏళ్ల ఇలియానా 2018లో ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రంలో కనిపించింది. ఆ సినిమా అపజయం చెందడంతో ఆమెకి మళ్ళీ తెలుగులో ఇంకో అఫర్ దక్కలేదు. ప్రస్తుతం హిందీలో ఈ భామ రెండు చిత్రాలు చేస్తోంది. ఇకపై ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే సినిమాల్లో కనిపిస్తానని ఇలియానా చెప్పింది.
- Advertisement -