- Advertisement -
హైదరాబాద్: ఏసు క్రీస్తు మృత్యువును జయించి పునరుత్థానం అయిన దినాన్ని ‘ఈస్టర్’ పండుగగా వేడుక జరుపుకుంటారు క్రైస్తవ సోదరులు. హైదరాబాద్‌లోని క్రైస్తవులు ఏప్రిల్ 17(ఆదివారం) ఈస్టర్ పండుగను జరుపుకుంటున్నారు. ఏసు క్రీస్తు ఖననం అయిన మూడో రోజున పునరుత్థానం చెందారని ‘న్యూ టెస్టమెంట్’ తెలుపుతోంది. ఆయనను రోమన్లు క్రీస్తు పూర్వం 30న కల్వరిలో శిలువ వేశారు. ఈ పునరుత్థాన దినమున చర్చి సర్వీసులు, ఫెస్టివ్ ఫ్యామిలీ మీల్స్, ఈస్టర్ గుడ్ల అలంకరణ, కానుకల బహుమానంతో వేడుకచేసుకుంటారు. రాత్రంతా మేల్కొని, తెలవారే వరకు ప్రార్థనలు జరుపుతారు. ఇదిలావుండగా హైదరాబాద్‌లో ఈస్టర్ వేడుకలు ఎలాంటి అట్టహాసం లేకుండా తగ్గు స్థాయిలో నిర్వహిస్తున్నారు.
- Advertisement -