- Advertisement -
హైదరాబాద్: కెసిఆర్ ప్రభుత్వం రాగానే పింఛన్ రూ.1000కి పెంచారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. రెండోసారి అధికారంలోకి రాగానే రూ.2000కు పెంచారని మంత్రి హరీశ్ తెలిపారు. త్వరలో 10 లక్షల మందికి కొత్తగా పింఛన్ ఇవ్వబోతున్నామని మంత్రి స్పష్టం చేశారు. 50 మహిళా గురుకుల కళాశాలలు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు పెంచామన్నారు. కెసిఆర్ పాలన చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు యాత్రలు చేస్తున్నామని ఆరోపించారు. అబద్ధాలు చెప్పయినా అధికారంలోకి రావాలని బిజెపి ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. బిజెపి వచ్చాక గ్యాస్ సిలిండర్ ధర రూ. వెయ్యికి పెంచారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పంచుతుంటే.. బిజెపి పెంచుతుంది.
- Advertisement -