Saturday, December 21, 2024

ఇంటి విందులో మిన్నంటిన కాల్పులు

- Advertisement -
- Advertisement -

Dinner party at house in Pittsburgh, USA, led to shooting

ఇద్దరు చిన్నారుల మృతి. రక్తసిక్తం

పిట్స్‌బర్గ్ : అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో ఓ ఇంట్లో విందు వికటించి కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో ఇద్దరు బాలలు మృతి చెందారు. 9 మంది గాయపడ్డారని స్థానిక పోలీసులు ఓ ప్రకటన వెలువరించారు. ఏదో ఫంక్షన్‌తో ఇంట్లో విందు తెల్లవారిదాకా సాగింది. కారణం తెలియదు అయితే ఇంటిలోపల ఉన్నట్లుండి 50 రౌండ్ల మేరకు కాల్పులు జరిగాయి. కొన్ని తూటాలను బయటకు కూడా కాల్చారు. ఈ ప్రాంతం అంతా తూటాలతో దెబ్బతిన్న గోడలు, నెత్తుటి మరకలతో కన్పించింది. ఈ ప్రాంతంలోనిపలు బ్లాక్‌లలో ఘటన గురించి స్థానిక పోలీసులు వివరాలు రాబడుతున్నారు. ఇప్పటివరకూ అనుమానితుల ఫోటోలు ఏవీ విడుదల చేయలేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News