Friday, November 22, 2024

మతం ముసుగులో రాజకీయాలు చేయం

- Advertisement -
- Advertisement -

We will build a shrine mosque church in Secretariat

సచివాలయంలో మందిరం, మసీదు, చర్చి నిర్మిస్తాం, నిశ్చింతగా ఉండండి : నెటిజన్ ప్రశ్నకు కెటిఆర్ జవాబు

మన తెలంగాణ/హైదరాబాద్: సచివాలయంలో మందిరం నిర్మిస్తాం, మసీద్ నిర్మిస్తాం, చర్చిని కూడా ని ర్మిస్తాం.. నిశ్చింతంగా ఉండండి అని ట్విట్టర్ వేదికగా మంత్రి కెటిఆర్ వెల్లడించారు. సచివాలయంలో మందిర నిర్మాణంపై ఓ నెటిజన్ ట్విట్టర్‌లో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. తాము మతం ముసుగు లో రాజకీయాలు చేయమని నాయకత్వంలో మతాలను స మానంగా చూస్తున్న రాష్ట్రం అని పే ర్కొన్నారు. సచివాలయ ప్రాంగణం లో గతంలో ఉన్న మసీదులు, ఆల యం, చర్చిలను  పాత భవనాల కూల్చివేత సందర్భంగా తొ లగించారు. వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేపడతామని ప్రభు త్వం గతంలోనే ప్రకటించింది. ఒక్కో ప్రార్థనా మందిరానికి 1500 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. మరోవైపు సచివాలయ నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి. వచ్చే దసరా నాటికి కొత్త సచివాలయ భవనాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని ఇంజినీర్లు, గుత్తేదారుకు ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలోనే స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా పనులు వేగవంతం చేశారు. మొత్తం 1,250 మంది కార్మికులు సచివాలయ పనుల్లో నిమగ్నమయ్యారు. 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లోనూ పనులు కొనసాగుతున్నాయి. మిగిలిన ఇతర పనులను కూడా సమాంతరంగా చేపడుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News