Saturday, December 21, 2024

హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో పెళ్లి

- Advertisement -
- Advertisement -

Marriage in Hindu and Christian traditions

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికి’ చిత్రం స్పెషల్ ప్రమోషనల్ కంటెంట్‌తో భారీగా సందడి చేస్తోంది. వివేక్ సాగర్ స్వరపరిచిన ఈ చిత్రంలోని మొదటి పాట పంచెకట్టు సూపర్‌హిట్ కాగా, పోస్టర్లు, హోమం వీడియో అందరినీ అలరించింది. ఇప్పుడు చిత్ర యూనిట్ టీజర్ రిలీజ్ డేట్‌ని ప్రకటించడంతో పాటు మరో రెండు బ్రాండ్ న్యూ పోస్టర్‌లను విడుదల చేసింది. ఈ పోస్టర్స్‌లో హీరో, హీరోయిన్‌లు హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాలను అనుసరించి పెళ్లి చేసుకోవడం ఆసక్తికరంగా వుంది. ఇందులో నాని సుందర్ అనే బ్రాహ్మణ అబ్బాయిగా నటిస్తుండగా, నజ్రియా లీలా థామస్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్‌ను ఈనెల 20న విడుదల చేయనున్నారు. ఈ చిత్రం తమిళ వర్షన్‌కి ‘అడాడే సుందరా’ అనే టైటిల్‌ని పెట్టగా, మలయాళ వర్షన్‌కి ‘ఆహా సుందరా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జూన్ 10న మూడు భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News