Saturday, December 21, 2024

‘ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు’ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Organic Uncle .. Hybrid Alludu Movie
చాలా కాలం గ్యాప్ తర్వాత దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి నేటి ట్రెండ్‌కి తగ్గట్లుగా ‘ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు’ వంటి వైవిధ్యమైన టైటిల్‌తో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా మజిలీ ఫేమ్ అనన్య హీరోయిన్‌గా అమ్ము క్రియేషన్స్ సమర్పణలో కల్పన చిత్ర పతాకంపై కోనేరు కల్పన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, కుష్భు, ఆలీ, సునీల్, వరుణ్ సందేశ్, రష్మీ, హేమ, అజయ్ ఘోష్, రాజా రవీంద్ర వంటి ఎందరో ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పూజా కార్యక్రమాల అనంతరం డా.రాజేంద్రప్రసాద్, సోహైల్, అనన్య లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సెన్షేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ క్లాప్ నివ్వగా ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి కెమెరా స్విచాన్ చేశారు.

అనంతరం ఏర్పాటైన మీడియా సమావేశంలో డా.రాజేంద్రప్రసాద్, సోహైల్, అనన్య, ఎస్వీ కృష్ణా రెడ్డి, నటులు సునీల్, వరుణ్ సందేశ్, వైవా హర్ష, జబర్దస్త్ రాఘవ, అప్పారావు, నటి హేమ, ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్, చిత్ర నిర్మాత కోనేరు కల్పన తదితరులు పాల్గొన్నారు. చిత్ర దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ “దాదాపు ఆరేళ్ళ గ్యాప్ తర్వాత ఈ సినిమా చేస్తున్నాను. చాలా మంది కలిసినప్పుడల్లా మీ మార్క్ కామిడీ చిత్రాలు రావటం లేదు..

అలాంటి సినిమాలు చూసి చాలా కాలమైంది అని అంటున్నారు. నాకు అదే ఫీలింగ్ కలిగింది. అప్పటినుండి మంచి కథలు రాసుకుంటూ సరైన ప్రొడ్యూసర్ కోసం ఎదురు చూశాను. అచ్చిరెడ్డి సలహా మేరకు కల్పన ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చారు. ఈ సినిమాకు సోహైల్, అనన్య చక్కగా సెట్ అయ్యారు”అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరామెన్‌ః సి. రాంప్రసాద్, ఎడిటింగ్‌ః ప్రవీణ్ పూడి, కొరియోగ్రఫీ: సుచిత్ర, సాహిత్యం: చంద్రబోస్, భాస్కరభట్ల, అనంత్ శ్రీరామ్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News