Monday, December 23, 2024

దళితబంధును వేగవంతం చేయండి

- Advertisement -
- Advertisement -

Speed up implementation of Dalit Bandhu: CM KCR

సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్

హైదరాబాద్ : ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకానికి ఎంపిక చేసిన అర్హులైన లబ్ధిదారులకు మరింత వేగంగా యూనిట్లు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. మంగళవారం జరిగిన ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో దళితబంధు పథకం అమలుపై చర్చించారు. ఇప్పటికే రోజుకు 400 వందల మంది చొప్పున 25వేల మంది అర్హులైన లబ్ధిదారులకు దళితబంధును అందజేశామని ముఖ్యమంత్రికి సిఎం కార్యదర్శి రాహుల్ బొజ్జా నివేదించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే దళితబంధు కోసం నిధులను విడుదల చేసిందన్నారు. ఈ నేపథ్యంలో గుర్తించిన అర్హులకు నిధులను అందించడంలో జాప్యం చేయోద్దన్నారు. దళితబంధు పథకాన్ని మరింత ప్రభావవంతంగా, వేగవంతంగా అమలు చేసేందుకు త్వరలో జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. దళితబంధు పథకం అమలవుతున్న విధానంపై దేశం నలుమూలలనుంచి ప్రశంసలు అందుకుంటున్నామని తెలిపారు.

ఈ పథకం అమలు ద్వారా మనం అనుకున్నదానికంటే ఎక్కువగా ఫలితాలు అందుతున్నాయని ముఖ్యమంత్రి వివరించారు. దళితబంధు కోసం చేస్తున్న ప్రతి రూపాయి పెట్టుబడిగా మారి, తిరిగి లాభాలను ఆర్జించి పెడుతుందన్నారు. అది సామాజిక పెట్టుబడిగా మారి, వ్యవసాయ రంగానికంటే గొప్పగా స్పిల్ ఎకానమీకి దోహదపడుతుందన్నారు. దళితబంధు పెట్టుబడి ద్వారా జరిగే వ్యాపార, వాణిజ్యాలు.. తద్వారా తిరిగి వచ్చే లాభాలు రాష్ట్ర జీఎస్టీపీని పెంచడంలో దోహదపడుతాయన్నారు. ఇప్పటికే దళితబంధు ద్వారా అందిన ఆర్థిక సాయం ద్వారా వ్యాపార, వృత్తి రంగాల్లో దళితులు సాధిస్తున్న విజయాలే అందుకు తార్కాణం అని వెల్లడించారు. ఏడాదికి రెండు లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు.. తద్వారా దళిత యువతలో వున్న నిరాశ, నిస్పృహలు తొలగిపోయి ఉత్సాహం పెరుగుతుంద్న్నారు. వారు వివిధ వృత్తులు, వ్యాపారాల్లో భాగస్వాములు కావడం ద్వారా ఉత్పత్తి పెరుగుతుందన్నారు. దవాఖాన్లు ఫెర్టిలైజర్ షాపుల లాంటి ప్రభుత్వం లైసెన్స్ అమలు పరుస్తున్న ప్రతి విభాగంలో దళితులకు రిజర్వేషన్లు ఏర్పాటు చేసి, వారికి అవకాశాలు కల్పించాలని సీఎం సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News