క్రిప్టో కరెన్సీ, బ్లాక్‌చైన్, డార్క్‌వెబ్‌పై శిక్షణ
ప్రారంభించిన రాచకొండ సిపి మహేష్ భగవత్
హైదరాబాద్ : సైబర్ క్రైంల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఇంటర్‌నెట్ బ్రౌజ్ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో పోలీసులకు మంగళవారం క్రిప్టోకరెన్సీ, బ్లాక్ చెయిన్, డార్క్‌వెబ్‌పై ఎన్‌డిసిఆర్‌టిసి శిక్షణ ఇచ్చారు. శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాచకొండ పోలీస్ కమిషన్ మహేష్ భగవత్ మాట్లాడుతూ అమాయకులు సైబర్ నేరస్థుల వలకు చిక్కుతున్నారని తెలిపారు. కొత్త సైబర్ నేరాలపై రాచకొండ పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. రోజు రోజుకు సైబర్ నేరాల్లో కొత్తవి వస్తున్నాయని తెలిపారు. మహారాష్ట్రలో 1,300 బిట్‌కాయిన్స్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఫ్యూచర్ క్రైం సైబర్ క్రైం అని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పోలీసులు క్రిప్టో కరెన్సీ, బ్లాక్‌చైయిన్, డార్క్ వెబ్‌పై శిక్షణ ఇచ్చిన ఆరిఫ్, ముబారక్‌ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సన్మానం చేశారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.