Saturday, November 23, 2024

బ్యాంక్ రుణం తీసుకుని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Man arrested for fraudulently taking bank loan

హైదరాబాద్: బ్యాంక్ నుంచి రుణం తీసుకుని మోసం చేసిన వ్యక్తిని నగర సిసిఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… నగరానికి చెందిన సాకేత్ తల్వార్ అనే వ్యక్తి బ్యాంక్ నుంచి రూ. 85లక్షలు రుణం తీసుకున్నాడు. రుణం తిరిగి కట్టకుండా జాల్సాలు చేస్తున్నాడు. ఇలాంటి మోసాలు గతంలో చేయడంతో నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిసిఎస్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News