Monday, January 20, 2025

రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రాజమౌళి

- Advertisement -
- Advertisement -

Rajamouli taken over as Director of State Information Department

 

మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అర్వింద్‌కుమార్ ఆకాంక్షలకు అనుగుణంగా సమాచార పౌర సంబంధాల శాఖను మెరుగ్గా తీర్చిదిద్దుతానని బి.రాజమౌళి తెలిపారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్‌గా బి.రాజమౌళి ఎసి గార్డ్‌లోని సమాచార భవన్‌లో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాజమౌళికి సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, సిబ్బంది అడిషనల్ డైరెక్టర్స్ నాగయ్య కాంబ్లె, కిషోర్ బాబు, జాయింట్ డైరెక్టర్స్ జగన్, శ్రీనివాస్, రమణ, మీడియా అకాడమీ సెక్రటరీ ఎన్. వెంకటేశ్వరరావు, జిహెచ్‌ఎంసీ సిపిఆర్‌వో మూర్తుజా, సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్లు ఎం. మధుసూదన్, వెంకటేశ్వర్లు, పాండురంగారావు, జి.ప్రసాదరావు, రాజారెడ్డి, సురేష్ తదితరులు రాజమౌళికి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News