Monday, December 23, 2024

ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా

- Advertisement -
- Advertisement -

విశ్వక్ సేన్ హీరోగా రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ప్రముఖ నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘రాజాగారు రాణివారు’ డైరెక్టర్ రవికిరణ్ కోలా ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. మే 6న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో విశ్వక్‌సేన్ మాట్లాడుతూ “విద్యాసాగర్, రవికిరణ్ చెప్పిన కథ నచ్చి ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్ ఇదవుతుంది. ట్రైలర్ అందరికీ నచ్చుతోంది. దాని కంటే పది రెట్లు సినిమా బావుంటుంది. మే 6న ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడండి”అని అన్నారు. దర్శకుడు విద్యాసాగర్ చింతా మాట్లాడుతూ “సినిమా చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు. సినిమా విజయంపై చాలా నమ్మకంగా ఉన్నాం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు బాపినీడు, సుధీర్ ఈదర, హీరోయిన్ రుక్సర్ థిల్లాన్, మ్యూజిక్ డైరెక్టర్ జై క్రిష్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News