ముగ్గురికి గాయాలు నిజామాబాద్
సుభాష్ నగర్‌లో విషాదం
మన తెలంగాణ/నిజామాబాద్ ప్రతినిధి: చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. జిల్లా కేంద్రమైన నిజామాబాద్ సుభాష్‌నగర్‌లో బుధవారం ఉదయం జరిగిన ఈ సంఘటన ఎలక్ట్రిక్ వాహనదారులను ఆందోళనకు గురిచేసింది. ఘటనలో సుభాష్‌నగర్‌కు చెందిన రామకృష్ణ మంటలకు ఆహుతై మృతి చెం దగా, ఆయన కుమారుడు కళ్యాణ్‌తో పాటు తల్లి, భార్యకు తీవ్రంగా గా యాలయ్యాయి. గాయపడ్డ ముగ్గురు స్థానికంగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికి త్స పొందుతున్నారు. అర్ధరాత్రి సమయంలో వాహనం బ్యాటరీకి చార్జింగ్ పెట్టి మరిచిపోవడంతో బ్యాటరీ చా ర్జింగ్ ఎక్కువై పేలిపోయినట్లు స్థానికు లు చెబుతున్నారు. ఈ సంఘటన ని జామాబాద్ నగరంలోని ఎలక్ట్రిక్ వా హనదారులను షాక్‌కు గురి చేసిం ది. కాలుష్య రహితంగా ఉండే ఎలక్ట్రిక్ వాహనాలపై ఇప్పుడిప్పుడే జనం మో జు చూపుతుండగా వరుస ఘటన లు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప లు జిల్లాల్లో ఇప్పటికే ఇలాంటి ఘటనలు వెలుగుచూడగా తాజాగా నిజామాబాద్‌లో ఒకరు మృతి చెందారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమో దు చే సుకొని ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై విచారణ జరుపుతున్నారు.