Monday, December 23, 2024

జలమండలికి మరో రెండు పిఆర్‌ఎస్‌ఐ అవార్డులు

- Advertisement -
- Advertisement -

Two more PRSI Awards for the Water Board

మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేతుల మీదుగా అందుకున్న పీఆర్వో సుభాష్

హైదరాబాద్ : పబ్లిక్ రిలేషన్స్ రంగంలో జలమండలి రెండు పిఆర్‌ఎస్‌ఐ అవార్డులను గెలుచుకుంది. పబ్లిక్ రిలేషన్స్ ఆప్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున్న గోల్డెన్ జూబ్లీ వేడుకలతో పాటు 3వ తెలంగాణ స్టేట్ పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పిఆర్ రంగంలో వివిధ సంస్దల పనితీరు ఆధారంగా అవార్డులకు ఎంపిక చేశారు. ఇందులో జలమండలికి రెండు అవార్డులు దక్కాయి. ఈ అవార్డుల కోసం జాతీయ, రాష్ట్ర స్దాయి సంస్దలు సింగరేణి కాలరీస్, ఎన్‌ఎండిసి, టిఎస్‌ఐఐసీ, టీశాట్, రాంకీ, అగ్రికల్చర్ యూనివర్శిటీ తదితర ప్రసిద్ద సంస్దలు పోటీపడ్డాయి. వాటర్ ఫర్ ఆల్… ఎక్సెలెన్స్ థ్రూ ఇన్నొవేషన్ పేరుతో జలమండలి రూపొందించిన కాపీ టేబుల్ బుక్‌కు మొదటి స్దానం దక్కింది. జలమండలికి సంబందించిన వివరాలు, చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాల సమాహారంగా ఈబుక్‌ను రూపొందించింది.

బెస్ట్ యూజ్ ఆప్ గ్రాఫిక్స్ ఆండ్ ఎఫెక్ట్ అనే కేటగిరిలో జలమండలి రూపొందించిన జలగీతం వీడియో సాంగ్ సైతం మొదటి స్దానాన్ని దక్కించుకుంది. జలమండలి ఎన్నో వ్యయ ప్రయాసలతో కృష్ణా, గోదావరి నదుల నుంచి నగర ప్రజలకు సరఫరా చేస్తున్న నీటి విలువను కళ్లకు కట్టేలా వివరించడంతో పాటు విలువైన నీటి వృథా చేయకుండా అవగాహన కల్పించడానికి నాలుగు నిమిషాల నిడివి కలిగిన వీడియో సాంగ్‌ను రూపొందించింది. జలమండలి ప్రధాన కార్యాలయంలో ఎండీ దానకిషోర్‌కు బోర్డు పిఆర్వో కడారి సుభాష్, ఓఎస్డీ పిఆర్వో మనోహరాచారి ఈ అవార్డులను అందించారు. జలమండలి పిఆర్‌సెల్‌కి రెండు అవార్డులు దక్కడం పట్ల ఎండీ దానకిషోర్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకోసం కృషి చేసిన పిఆర్ బృందాన్ని ఆయన అభినందించారు. అంతకు ముందు ది ప్లాజా హోటల్‌లో నిర్వహించిన పిఆర్‌ఎస్‌ఐ గోల్డెన్ జూబ్లీ వేడుకలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేతుల మీదుగా సుభాష్, మనోహరా చారి ఈ అవార్డులను అందుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News