- Advertisement -
అమరావతి: ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను సుప్రీం కోర్టు శుక్రవారం రద్దు చేసింది. మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశించింది. 1969 అభిలభారత సర్వీసు నిబంధనల ప్రకారం సస్పెన్షన్ కొనసాగబోదని తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్ పిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీం స్పష్టంగా చెప్పింది. ఈ తీర్పును జస్టిస్ కన్విల్కర్ ధర్మాసనం వెల్లడించింది.
- Advertisement -