Monday, December 23, 2024

కమ్మ సామాజిక వర్గాన్ని దెబ్బతీసేందుకు కుట్ర…

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: కమ్మ సామాజికవర్గాన్ని దెబ్బతీసేందుకు కొన్ని వర్గాలు కుట్రలు పన్నుతున్నాయని కమ్మ సామాజికవర్గంలోని అన్ని వర్గాలు ఐక్యతగా ఉండాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో కమ్మజన సేవా సమితి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఎసి కల్యాణ మండపాన్ని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడారు.
రాష్ట్రంలో ఉన్న కమ్మ కులస్థులు అందరు రాజకీయాలకతీతంగా ఐక్యతగా ఉండి కమ్మ సామాజిక వర్గాన్ని బలోపేతం చేయాలని కోరారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రివర్గంలో కమ్మ సామాజిక వర్గంలో నాకు మంత్రి పదవి ఇవ్వటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని వర్గాల కుట్ర ఫలితంగా కమ్మ సామాజికవర్గ మంత్రి నానీని తొలగించారని,  ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కమ్మ సామాజికవర్గం నుంచి తనని తొలగించేందుకు తనపై నిందలు మోపి కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.  తెలుగు రాష్ర్టాల్లో ఉన్న కమ్మ సామాజికవర్గం మంత్రులపై కుట్రలు పన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని కమ్మ కులస్థుల అందరూ రాజకీయాలకతీతంగా ఐక్యతగా ఉండాలని కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కమ్మ సామాజికవర్గానికి చెందిన నాయకులకు ఎమ్మెల్యే, ఎంపి, ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్ష పదవులు కట్టబెట్టారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వల్ల కమ్మ సామాజిక వర్గం రాజకీయంగా అభివృద్ధి చెందిందని అన్నారు.  ఎన్టీ రామారావు అన్ని సామాజిక వర్గాలను న్యాయం చేశారని తెలిపారు. ఈ సందర్బంగా అమ్మ దైవ సేవా సమితి ఆధ్వర్యంలో మంత్రిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే లావూడ్యా రాములునాయక్, స్థానిక కమ్మజన సేవా సమితి సంఘం నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News