- Advertisement -
అత్తాపూర్ : హైదరాబాద్ అత్తాపూర్ లోని ఓ కార్ల షెడ్ లో శుక్రవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. జనప్రియ ఉటోపియా వద్ద కార్ల షెడ్ లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది భయంతో బయటకు పరుగులు పెట్టారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. మెర్సిడెస్ బెంజ్, బిఎండబ్ల్యూ, ఆడి వంటి విలువైన కార్లు దగ్ధమయ్యాయని సిబ్బంది తెలిపారు. ఇప్పటివరకు 15 ఖరీదైన కార్లు కాలిపోయాయని అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -