Friday, December 20, 2024

నేడు గ్రూప్-1పై కీలక నిర్ణయం

- Advertisement -
- Advertisement -

A key decision on TSPSC Group 1

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 నోటిఫికేషన్‌పై శనివారం కీలక నిర్ణయం తీసుకోనున్నది. నోటిఫికేషన్ విడుదలపై టిఎస్‌పిఎస్‌సి కీలక నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. గ్రూప్-1పై ఇప్పటికే దశల వారీగా సమావేశాలు నిర్వహించిన కమిషన్, శనివారం మరోసారి సమావేశమవుతున్నది. ఈ అంశంపై అన్ని శాఖలను సమన్వయం చేసుకొని ఒకటికి రెండు సార్లు క్షేత్రస్థాయి లో చర్చించింది. గతంలో జరిగిన పొరపాట్లను అధ్యయనం చేసి, మళ్లీ అలాంటి సమస్యలు రాకుండా కమిషన్ చర్యలు తీసుకుంటున్నది. రెండుమూడు శాఖల నుంచి వచ్చిన నివేదికలను కొన్ని సవరణల కోసం పంపినట్లు తెలిసింది. ప్రస్తుతం ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించి, నోటిఫికేషన్ జారీపై కీలక నిర్ణయం తీసుకొనే అవకాశమున్నట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే సమావేశం తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీచేసే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News