- Advertisement -
హైదరాబాద్: లగ్జరీ కార్ల దొంగ సత్యేంద్రసింగ్ షెకావత్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సత్యేంద్ర రాజస్థాన్ జైపూర్ కు చెందిన ఆర్మీ జవాన్ కుమారుడు. 2003 నుంచి కార్ల దొంగగా మారాడు. ఇప్పటివరకు నిందితుడిపై పది రాష్ట్రాల్లో 61 చోరీ కేసులున్నాయి. అధునాతన సాంకేతికతో సత్యేంద్ర కార్ల దొంగతనాలు చేస్తున్నాడు. గతేడాది జనవరిలో బంజారాహిల్స్ పరిధిలో ఓ స్టార్ హోటల్ లో లగ్జరీ కారు దొంగతనం చేసిన సత్యేంద్ర, దమ్ముంటే నన్న పట్టుకోండని పోలీసులకు వీడియో కాల్ చేసి సవాల్ విసిరాడు. బెంగళూరు పోలీసులు ఫిబ్రవరిలో సత్యేంద్రను అరెస్ట్ చేశారు. పీటీ వారెంట్ పై మూడు రోజుల కస్టడీ విచారణకు బంజారాహిల్స్ పిఎస్ కు తరలించారు. కార్ల రికవరీ కోసం నిందిగుడ్ని బంజారాహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు.
- Advertisement -