ముంబయి: ఇటీవల 94వ ఆస్కార్(అకాడమి) అవార్డుల ప్రదానోత్సవంలో తన భార్య జడా పింకెట్ స్మిత్ బోడితలపై అపహాస్యంగా వ్యాఖ్యలు చేసిన హోస్ట్, కామెడియన్ క్రిస్ రాక్‌ను చెంప పగులగొట్టి అందరి దృష్టిని ఆకర్షించిన ప్రముఖ నటుడు విల్ స్మిత్ గత కొన్ని రోజులుగా వార్తల్లో లేరు. అయితే ఆ మరునాడే ఇన్‌స్టాగ్రామ్‌లో రాక్‌కు క్షమాపణలు చెప్పుకున్నారు. కాగా ఆయనను ఆస్కార్ ఈవెంట్ నుంచి 10 ఏళ్ల పాటు నిషేధించారు. తాను ఆ పనిష్మేంట్‌ను స్వీకరిస్తున్నట్లు కూడా అతడు చెప్పాడు. అయితే స్మిత్ ఇప్పటికీ తాను పోషించిన పాత్రలకుగాను నామినేట్ కావొచ్చు, అవార్డులు పొందవచ్చు. ఇదిలావుండగా స్మిత్ శనివారం ముంబయి కలినా విమానాశ్రయంలో కనిపించాడు. ఆయన ఇండియాకు ఎందుకొచ్చారన్న విషయం తెలియకపోయినప్పటికీ ఆయన ఆధ్యాత్మిక గురువులతో కనిపించారు. అంతేకాక ఆయన ఇతరులతో నవ్వుతూ మాట్లాడారు. ఆస్కార్ ఘటన తర్వాత ఆయన ఇలా పబ్లిక్‌గా దర్శనం ఇవ్వడం ఇదే మొదటిసారి. అతడు విమానాశ్రయంలో ‘పపరాజీ’లకు చేతులూపాడు, అభిమానులతో కలిసి ఫోటోలు కూడా తీయించుకున్నాడు. ఓ పపరాజో కథనం ప్రకారం అతడు జుహులోని జెడబ్లు మారియట్ హోటల్ బస చేశాడు. కాగా శనివారం ముంబయికి వెళ్లాడు. విల్‌స్మిత్ అనేకమార్లు ఇండియాకు వచ్చాడు. వారణాసిలో గంగ హారతి, తన వీడియో సీరిస్ కోసం ఆధ్యాత్మిక గురువు సద్గురును కూడా కలిశారు.
ఇండియాలో పర్యటిస్తున్న నటుడు విల్ స్మిత్
- Advertisement -
- Advertisement -
- Advertisement -